Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మీ మౌనం చెవిటిది
- ప్రధాని మోడీకి 108 మంది మాజీ బ్యూరోక్రాట్లు లేఖ
న్యూఢిల్లీ : దేశంలో ద్వేష పూరిత రాజకీయాలకు స్వస్తి పలకాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని 108 మంది మాజీ బ్యూరోక్రాట్లు కోరారు. ఈ మేరకు ప్రధాని మోడీకి సంతకాలతో కూడిన మూడు పేజీల లేఖ రాశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇటీవల జరిగిన మత హింస కేసులపై స్పందించారు. మీ మౌనం చెవిటిదని పేర్కొన్నారు. 'దేశంలోని రాజకీయ పరిస్థితుల గురించి ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా ద్వేషపూరిత రాజకీయాలకు' స్వస్తి పలకాలని లేఖలో వారు కోరారు. దేశంలో అతి పెద్ద సామాజికి ముప్పును ఎదు ర్కుటున్నామనీ, ఇది కేవలం రాజ్యంగ నైతికత, ప్రవర్తనకు సంబంధించినది మాత్రమే కాదని ఆ లేఖలో స్పష్టం చేశారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే మీ వాగ్దానాన్ని హృదయపూర్వకంగా స్వీకరించాల్సిందిగా ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది 'ఆజాదీ కా అమృత్ మహౌత్సవ్'లో పక్షపాత ధోరణికి అతీతంగా వ్యవహరించాలని తాము ఆశిస్తున్నామని పేర్కొన్నారు. మీ పార్టీ నియంత్రణలో ఉన్న ప్రభుత్వాలు చాలా పట్టుదలతో ద్వేషపూరిత రాజకీయాలకు కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. అంతేకాదు మన వ్యవస్థాపక పితామహులు సృష్టించిన రాజ్యాంగ విధానాన్ని నాశనం చేసేలా పరిస్థితి తలెత్తడంతోనే తమ ఆవేదనను, భావనను, వ్యక్తికరీంచేలా ఈ లేఖ రాసేందకు పురికొల్పిందన్నారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ముస్లింలు మతపరమైన ద్వేషానికి ఎక్కువగా గురవుతున్నారని అన్నారు. అంతేకాదు అధికారంలో ఉన్న బీజేపీ శాంతి, సామరస్యాన్ని కాపాడే సాధనంగా కాకుండా, మైనారిటీలను నిత్యం భయాందోళనకు గురిచేసే సాధనంగా మారిందన్నారు. అసోం, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, కర్నాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి అనేక రాష్ట్రాల్లో గత కొన్ని సంవత్సరాలుగా, కొన్ని నెలల్లో మైనారిటీ కమ్యూనిటీలపై, ముఖ్యంగా ముస్లింలపై ద్వేషపూరిత హింస తీవ్రమైందని పేర్కొన్నారు. ఇందులో ఢిల్లీని మినహా మిగిలినవన్నీ బీజేపీ పాలిత రాష్ట్రాలేననీ, ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం పోలీసుల నియంత్రణలో ఉందని అన్నారు. ఆయా రాష్ట్రాల్లో భయపెట్టే కొత్త కోణంతో కొన్ని శక్తులు పేట్రేగిపోతున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు మాజీ జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) శివశంకర్ మీనన్, మాజీ విదేశాంగ కార్యదర్శి సుజాత సింగ్, మాజీ హోం కార్యదర్శి జికె పిళ్లై, ఢిల్లీ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ టికెఎ నాయర్‌తో సహా మహారాష్ట్రకు చెందిన జూలియో రిబీరో, రవి బుద్ధిరాజా, విపి రాజా, మీరన్ బోర్వాంకర్, అన్నా డానిలతో పాటు 108 మంది ఆ లేఖపై సంతకాలు చేశారు.