Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రానికి సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో డిమాండ్
- మోడీ సర్కారు చర్యపై తీవ్ర వ్యతిరేకత
- ఎల్ఐసీ ఉద్యోగులు, పాలసీదారుల పోరాటానికి సంఘీభావం
న్యూఢిల్లీ : ఎల్ఐసీ ఐపీఓను సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది ఎల్ఐసీ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడానికేనని ఆరోపించింది. దాదాపు 29 కోట్ల మంది ఎల్ఐసీ పాలసీదారులకు చెందిన అమూల్యమైన ఆర్థిక ఆస్థులను అప్పనంగా అందించే కుట్రగా పేర్కొన్నది. ఎల్ఐసీ ఐపీఓను వెంటనే ఆపాలని మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో ఒక ప్రకటనను విడుదల చేసింది. బీమా ప్రపంచంలో ఎల్ఐసీకి ప్రత్యేక స్థానం ఉన్నది. ఇది దేశ నిర్మాణానికి తోడ్పడటానికి ప్రయివేటు బీమా కంపెనీల జాతీయీకరణ ద్వారా సృష్టించబడింది. సాధారణ ప్రజలలో ప్రజాదరణ పొందిందని నిరూపించబడింది. ఇది వ్యాపారం వేగవంతమైన విస్తరణకు దారితీసింది. జీఓఐ రూ.5 కోట్లు మాత్రమే పెట్టుబడి పెట్టింది. ఈ రోజు మొత్తం లైఫ్ ఫండ్ రూ.34 లక్షల కోట్లు. ఇప్పుడు ఆ సంస్థ లక్షణాన్ని పాలసీ హోల్డర్ల ట్రస్ట్ నుంచి వాటాదారుల యాజమాన్యంలోని లాభాలను పెంచే కంపెనీగా మార్చాలనుకుంటున్నది. ఎల్ఐసీ వాటాల విక్రయమనేది పాలసీ-హౌల్డర్లకు భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని విక్రయించటం. ఐపీఓ చిక్కుల గురించి వారిని (పాలసీ హౌల్డర్లు) సంప్రదించలేదు. వారికి తెలియజేయలేదు. ఈ ప్రక్రియ వివరాలు ఇప్పుడు బయటపడ్డాయి. ఎల్ఐసీ ఎంబెడెడ్ విలువ (ఈవీ) తాజా అంచనా రూ. 5.40 లక్షల కోట్లుగా నిర్ణయించబడింది. దాదాపు రెండు నెలల క్రితం ఎల్ఐసీ షేరు నిజమైన విలువ చేరుతుందని అంచనా వేయడింది. అయినప్పటికీ, అంతర్జాతీయ పెట్టుబడుదారులచే సమ్మతించబడిన ప్రభుత్వం ఇప్పుడు వాల్యుయేషన్‌ను నాటకీయంగా తగ్గించడానికి ప్రయత్నిస్తున్నది. ఇన్సూరెన్స్ రంగం నియంత్రణను తీసేవేసి 25 ఏండ్లు గడిచినప్పటికీ.. దేశంలో ఇప్పటికీ ఎల్ఐసీ పాలసీలలో 73 శాతం, మొదటి సంవత్సరం ప్రీమియంలో 61 శాతం వాటాను కలిగి ఉన్నది. ఇది ప్రపంచంలోని అత్యంత విలువైన బీమా బ్రాండ్లలో ఒకటి. దీని ఆస్థులు మొత్తం రూ. 38 లక్షల కోట్లు. దేశవ్యాప్తంగా దీనికి లక్ష మందికి పైగా ఉద్యోగులు, 14 లక్షల మంది ఏజెంట్లు ఉన్నారు. భారతదేశంలో జీవిత బీమాకు మార్గదర్శకం వహించిన కంపెనీ.. దాదాపు మూడింటా రెండు వంతుల మార్కెట్ వాటాను కలిగి ఉన్నది. ఆరు దశాబ్దాలుగా ఎలాంటి మచ్చ లేకుండా ట్రాక్ రికార్డు ఉన్నది. వేగంగా డబ్బు సంపాదించటానికి అనుగుణంగా లక్షలాది మంది పాలసీదారుల ఖర్చుతో అంతర్జాతీయ పెట్టుబడిదారులతో ''విలువ'' పొందేందుకు అనుమతించబడుతున్నది. కోట్లాది మంది పాలసీదారుల ఆస్తులను ఎక్కువగా కలిగి ఉన్న సంస్థ ఐపీఓను సూత్రప్రాయంగా వ్యతిరేకించిన పొలిట్ బ్యూరో.. ప్రత్యేకించి ఏకపక్ష పద్దతిలో ఎల్ఐసీ వాస్తవ విలువను తక్కువగా అంచనా వేయటం, పాలసీదారుల ప్రయోజనాలను బలహీనపర్చటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తున్నదని ఆరోపించింది. ఐపీఓ పట్ల సాధ్యమైన విస్తారమైన వ్యతిరేకతను సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో కోరింది. ఎల్ఐసీ ఉద్యోగులు, పాలసీదారులు కొనసాగిస్తున్న పోరాటానికి సంఘీభావం తెలిపింది. కేంద్రం ఈ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేసింది.