Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : రెండు వ్యాక్సిన్ డోసుల తర్వాత తీసుకునే బూస్టర్ డోసు వ్యవధిని తొమ్మిది నెలల నుంచి ఐదు-ఆరు నెలలలకు తగ్గ్గించాలని టాటా ఇన్స్టిట్యూట్ ఫర్ జెనెటిక్స్ అండ్ సొసైటీ (టీఐజీఎస్) డైరెక్టర్ డా. రాకేష్ మిశ్రా కోరారు. ఇది మంచి విధానమని అన్నారు. 'తొమ్మిది నెలల ముందు బూస్టర్ డోసు అందుబాటులోకి తెచ్చినట్లయితే... అది చాలా మంచిది. బూస్టర్ డోసులను అందించేందుకు ఐదు-ఆరు నెలలు మంచి సమయం. టీకాలు అందుబాటులో ఉంటే వాటిని వినియోగించాలి' అని రాకేష్ తెలిపారు. భారత్లో నాల్గవ వేవ్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు. అయితే వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మన వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రభావవంతమైనదని, చాలా మంది అర్హులు టీకాలు తీసుకున్నారని తెలిపారు. పిల్లలు కూడా డోసులు పొందుతున్నారని, చాలా మంది బూస్టర్ డోసులు కూడా తీసుకుంటున్నారన్నారు. సీరో సర్వే 80-90 శాతం పాజిటివిటీగా ఉందని, అసాధారణ పరిస్థితుల్లోనే నాల్గవ వేవ్ వస్తుందని అన్నారు. రీకాంబినెంట్ వేరియంట్ల గురించి మాట్లాడుతూ... ఆందోళన కలిగించేది కాదని. ఇది సాధారణ ఫ్లూలాంటిదన్నారు. వైరస్లు కొత్త వేరియంట్లు తయారయ్యేందుకు కేవలం మ్యూటేషన్ ద్వారా మాత్రమే కాకుండా ఇలా కొత్త మార్గాన్ని ఎంచుకున్నాయని అన్నారు.