Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పార్టీలో చేరరని, చర్చలకు ముందే కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ స్పష్టం చేసినటు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆయనను పార్టీలో చేరాలని ఆహ్వానిం చడం ఇది మొదటిసారి కాదని, పలుమార్లు ఇలాగే చర్చలు జరిగాయని రాహుల్ పేర్కొన్నట్టు సమా చారం. పార్టీలో చేరికపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరపడం వరుసగా ఇది ఎనిమిదో సారి కావడం గమనార్హం. ఇటీవల సీనియర్ నేతలతో పశాంత్ కిషోర్ జరిపిన చర్చల్లో రాహల్ గాంధీ పాల్గొనలేదు. ఏ ఒక్క సమావేశానికి ఆయన హాజరు కాలేదు. రాహుల్‌గాంధీ విదేశీ పర్యటనలో ఉన్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ప్రశాంత్‌కిషోర్ కాంగ్రెస్ పార్టీ పలుకుబడి ద్వారా ఇతర పార్టీలకు లాభం చేకూ ర్చాలని భావిస్తున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ వాదనలను ప్రశాంత్‌కిషోర్ సన్నిహిత వర్గాలు తోసిపుచ్చుతున్నాయి. రెండు రోజుల క్రితం కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం నేతత్వంలో ఓ సాధికారిత కమిటీని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఉండేందుకు ప్రశాంత్ కిశోర్‌కు సోనియా ఆఫర్ చేయగా.. ఆయన తిరస్కరించారు. ఈ ఆఫర్‌ను ఆయన ఎందుకు తిరస్కరించారో తమకు తెలియదని పి. చిదంబరం అన్నారు.