Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆలస్యం చేస్తే పంజాబ్ గతే ..: సచిన్ పైలట్
జైపూర్ : రాజస్తాన్ రూపంలో కాంగ్రెస్ అధిష్టానానికి మరో తలనొప్పి రానుంది. ఏ మాత్రం ఆలస్యం కాకుండా తాను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు రాజస్తాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి తన మనసులో మాట బయటపెట్టేశారని సమాచారం. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది కన్నా ఎక్కువ సమయం ఉన్నందున... పార్టీ తిరిగి అధికారంలోకి రావాలనుకుంటే.. చకాచకా పనులు జరగాలని సచిన్ భావిస్తున్నారు. అలా కాకపోతే.. పంజాబ్ గతే రాజస్తాన్‌కు పట్టవచ్చునని సోనియా గాంధీ, ప్రియాంక గాంధీకి విన్నవించారు. ఈ విషయంపై గత కొన్ని వారాలుగా సోనియా, ప్రియాంక, రాహుల్ గాంధీలు పలుమార్లు సచిన్‌తో భేటీ అయ్యారు. కాగా, 2023 డిసెంబర్లో రాజస్తాన్ ఎన్నికలు జరగనుండగా.. నిర్ణయం తీసుకోవడంలో కాస్త ఆలస్యం జరిగినా పంజాబ్ గతే పునరావృతం కావచ్చునని సోనియాకు తెలిపినట్టు సమాచారం. కాగా, సచిన్ ఈ ప్రతిపాదన కొత్తగా తెచ్చిందేమీ కాదు. గతంలో 18 మంది ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబావుటా ఎగురవేయడంతో.. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ 100 మందికి పైగా ఎమ్మెల్యేలను రిస్టార్ట్స్‌లో ఉంచాల్సి వచ్చింది. చివరకు తన మద్దతుదారులకు మంత్రి వర్గంలో చోటు కల్పిస్తానని హామీనివ్వడంతో సచిన్ వెనక్కు తగ్గిన సంగతి విదితమే.