Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జనవరి నుండి 62మంది తీవ్రవాదుల హతం
శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించిన తర్వాత జమ్మూ కాశ్మీర్ల్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని బీజేపీ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, తీవ్రవాదుల హింసాకాండలో మాత్రం ఎలాంటి తగ్గుదల కనిపించడం లేదు. సర్పంచులు, కిందిస్థాయి సభ్యులు, వర్కర్లతో సహా పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగుతునే వున్నాయి. మిలిటెంట్లు, భద్రతా బలగాల మధ్య రోజువారీ కాల్పులు కూడా జరుగుతునే వున్నాయి. గత నెల్లో కాశ్మీరు లోయలోని వివిధ తీవ్రవాద దాడుల్లో ముగ్గురు పంచాయితీ సభ్యులు హత్యకు గురయ్యారు. మార్చి నుండి ఇప్పటివరకు 8మంది స్థానికేతర కూలీలపై కాల్పులు జరిగాయి. అలాగే ఈ ఏడాది ప్రారంభం నుండి ఇప్పటివరకు వివిధ ఎన్కౌంటర్లలో భద్రతా బలగాలు 62మంది తీవ్రవాదులను హతమార్చాయి. వారిలో 47మంది స్థానిక తీవ్రవాదులేనని, కాశ్మీర్‌లోని వివిధ ప్రాంతాల్లో తమ కార్యకలాపాలు సాగిస్తున్నవారేనని పోలీసులు తెలిపారు.