Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తమళినాడు అసెంబ్లీ తీర్మానం
చెన్నై : ఆర్థిక సంక్షోభంలో ఉన్న శ్రీలంకకు సహాయం చేయడానికి తక్షణమే అనుమతించాలని కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ తమిళనాడు అసెంబ్లీ శుక్రవారం ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. ప్రాణాలను నిలిపే అత్యంవసర మందులతో పాటు ఆహారం, ఇతర నిత్యవసర వస్తువులు పంపుతామని తెలిపింది. మానవతా ప్రాతిపదికన సహాయం అందించడానికి అనుమతించాలని ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కోరారు.