Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొచ్చి : రాష్ట్రంలో నిరుద్యోగుల సమగ్ర సమాచారాన్ని సేకరించడం కోసం కేరళ ప్రభుత్వం త్వరలో సర్వేను నిర్వహించనుంది. ఈ సర్వే ద్వారా అక్షరాస్యులై నిరుద్యోగులుగా ఉన్న 18 నుంచి 59 ఏండ్ల వ్యక్తుల సమగ్ర సమాచారాన్ని సేకరిస్తారు. ముందుగా కొచ్చి జిల్లావ్యాప్తంగా 'మై జాబ్ మై ప్రైడ్' పేరుతో ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. జిల్లాలో మే 8 నుంచి 15 వరకూ ఈ సర్వే జరుగుతుంది.
కుటుంబ శ్రీ మిషన్, కేరళ నాలెడ్జ్ ఎకానమీ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక సంస్థ భాగస్వామ్యంతో ఈ సర్వేను నిర్వహిస్తారు. 5,383 మంది శిక్షణ పొందిన ఎన్యూమరేటర్లు ఇందులో పాల్గొంటారు. 'వయస్సు, లింగం, నివసిస్తున్న ప్రాంతం, పని చేయడానికి సుముఖతతో సహా అన్ని వివరాలను సేకరిస్తాం.