Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. వరుసగా రెండోరోజూ మూడు వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 3,377 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. గురువారంతో పోలిస్తే కొత్త కేసులు స్వల్పంగానే పెరిగినప్పటీకీ రోజువారీ పాజిటివిటీ రేటు 0.71శాతానికి చేరిందని అన్నారు. యాక్టివ్ కేసులు 17,801గా ఉండగా, యాక్టివ్ కేసుల రేటు 0.04శాతంగా ఉంది. 2,496 మంది కరోనా నుంచి కోలుకో గా, రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 60 మంది మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 5.23లక్షలకు పెరిగింది.
ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టాలినా జార్జివాకు పాజిటివ్
అమెరికాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైనట్లు అధికారులు తెలిపారు. తేలికపాటి లక్షణాలు ఉండటంతో నివాసంలోనే ఐసోలేషన్‌లో ఉన్నట్లు వాషింగ్టన్కు చెందిన ప్రతినిధి గెర్రీ రైస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్లో విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. క్రిస్టాలినా కరోనా వ్యాక్సిన్ మూడు డోసులు వేయించు కున్నా, ఆమెకు పాజిటివ్ వచ్చిందని వైద్యులు చెప్పారు. ఇటీవల అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్తోపాటు పలువురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైన సంగతి తెలిసిందే.