Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) కొత్తగా సీనియర్ సిటిజన్ల కోసం తమ బీఓబీ వాల్డ్ మొబైల్ బ్యాంకింగ్ యాప్లో ప్రత్యేక ఫీచర్ను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. ఇందులో పెద్దవారు సులభంగా తమ లావాదేవీలను పూర్తి చేయడానికి వీలుందని పేర్కొంది. సులభంగా గుర్తించేలా పెద్ద అక్షరాలు, ధ్వని ఆధారంగా కూడా సేవలను పొందవచ్చని తెలిపింది. ఇందులో 250 సేవలు అందుబాటులో ఉంటాయని బీఓబీ సీఈఓ, ఎండీ సంజీవ్ చదా తెలిపారు.