Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణకు సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ : తెలుగు అకాడమీ విభజన వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌కు చెల్లించాల్సిన మొత్తాన్ని ఆరు శాతం వడ్డీతో చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. పిటి షన్ను వెనక్కి తీసుకునేందుకు తెలంగాణకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. 2021 జనవరిలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల అమలుకు సుప్రీంకోర్టు నెల రోజులు సమయమిచ్చింది. పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ హిమాకోహ్లి ధర్మాసనం విచారించింది. పెండింగ్‌లో ఉన్న రూ.33 కోట్లు వడ్డీతో సహా చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. ఏపీకి ఇప్పటికే రూ. 92.94 కోట్లు చెల్లించినట్లు తెలంగాణ సర్కార్ తెలిపింది. అయితే, మిగిలిన డబ్బు మొత్తానికి 6 శాతం వడ్డీ చెల్లించాలని కోర్టు ఆదేశించింది.