Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్లోబల్ పాటిదార్ బిజినెస్ సమ్మిట్లో ప్రధాని మోడీ
సూరత్ : మీకు ఇంకా ఏం కావాలో అడగండి,, ఇచ్చేస్తామని వ్యాపారవేత్తలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ శుక్రవారం ఆఫర్ ఇచ్చారు. ఇక్కడ మూడు రోజుల పాటు జరిగే గ్లోబల్ పాటిదార్ బిజినెస్ సమ్మిట్ 2022 శుక్రవారం ప్రారంభమయింది. ఈ సభను వర్చువల్గా ప్రారంభిస్తూ ప్రధాని మోడీ మాట్లాడారు. మీకు ఇంకా ఏం కావాలో అడగండి ఇచ్చేస్తామని తెలిపారు. అలాగే బ్యాకింగ్, ఇతర రంగాల్ల్లో మరిన్ని సంస్కరణలు చేయడానికి ఒక బృందంగా ఏర్పడి ప్రభుత్వానికి సూచలను ఇవ్వాలని వ్యాపారులు, నిపుణులకు మోడీ సూచించారు. 'బ్యాంకింగ్, ఇతర రంగాలలో లోపాలు, సంస్కరణలతో పాటు వాటిలో ఎలా మార్పులు తీసుకునిరావాలో సూచించడానికి పారిశ్రామికవేత్తలు, నిపుణులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను' అని మోడీ తెలిపారు. ఎవ్వరైనా పారిశ్రామికవేత్తగా మారడానికి, దాని గురించి గర్వపడే వాతావరణాన్ని సృష్టించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.