Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 8మంది ప్రపంచ నేతలతో భేటీ....
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ మూడు రోజుల్లో మూడు దేశ్లాల్లో పర్యటించనున్నారు. దాదాపు 65 గంటలపాటు వివిధ నేతలతో 25 సమావేశాల్లో పాల్గొననున్నారు. వీరిలో ఎనిమిదిమంది ప్రపంచ నేతలు ఉన్నారు. వేలాదిమంది ప్రవాస భారతీయులతో భేటీ కానున్నారని ప్రభుత్వ వర్గాలు శనివారం తెలిపాయి. ఈ ఏడాది ప్రధాని జరిపే తొలి పర్యటన ఇది. దైపాక్షిక, బహుళ పక్ష సమావేశాలు జరపనున్నారు. 50 అంతర్జాతీయ వాణిజ్య సంస్థల అధిపతులతో కూడా చర్చలు జరపనున్నారు. జర్మనీ, డెన్మార్క్, ఫ్రాన్స్ దేశాల్లో మే 2 నుంచి మూడు రోజుల పాటు ఈ పర్యటన జరగనుంది. తొలుత జర్మనీలో పర్యటించనున్న మోడీ తర్వాత డెన్మార్క్ వెళతారు. తిరుగు ప్రయాణంలో పారిస్‌లో ఆగుతారు. ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో తిరిగి ఎన్నికైన ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌తో చర్చలు జరుపుతారు. బెర్లిన్‌లో ప్రధాని, జర్మనీ ఛాన్సలర్ ఓల్ఫ్ షుల్జుతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్, జర్మనీ అంతర ప్రభుత్వ సంప్రదింపుల కమిటీ (ఐజిసి) ఆరో సమావేశంలో ఇరువురు పాల్గొంటారని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.