Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయనగరం: విజయనగరం జిల్లా డెంకాడ మండలంలో ఘోరం చోటుచేసుకుంది. 20 నుంచి 25 ఏండ్ల వయస్సున్న ఓ యువతిపై అఘాయిత్యానికి ఒడిగట్టిన దుండగులు ఆ పై పెట్రోలు పోసి నిప్పు పెట్టి అతిదారుణంగా హత్య చేసినట్లు భావిస్తున్నారు. డెంకాడ నుంచి పూసపాటిరేగ వెళ్లే కుమిలి రోడ్లోని దయాల్ నగర్-బేతనాపల్లి దారి మధ్యలో శరీరం పూర్తిగా కాలిపోయిన బాధితురాలి మృతదేహాన్ని స్థానికులు శనివారంనాడు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘాతుకం వెలుగులోకి వచ్చింది.