Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏప్రిల్‌లో 122 ఏండ్ల గరిష్ట ఉష్ణోగ్రతలు
న్యూఢిల్లీ : మేలోనూ దేశవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణ సంస్థ (ఐఎండి) తెలిపింది. ''మేలో, వాయువ్య, మధ్య, తూర్పు, ఈశాన్య భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణ కనిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. దక్షిణ ద్వీపకల్ప భారతదేశం, వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం నుంచి సాధారణం కంటే తక్కువ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది'' పేర్కొంది. మేలో వేడిగాలులు రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లో కొనసాగే అవకాశం ఉందని ఐఎండి డైరెక్టర్ జనరల్ మృత్యుంజరు మహాపాత్ర శనివారం మీడియాకు తెలిపారు. రాత్రి సమయంలో సైతం ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయన్నారు. ఏప్రిల్‌లో సగటు నెలవారీ గరిష్ట ఉష్ణోగ్రత 35.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఏప్రిల్‌లో సగటు ఉష్ణోగ్రత ఈ స్థాయిలో ఉండటం 122 ఏళ్లలో ఇది నాలుగోసారి. 1901 నుంచి చూస్తే, 1973, 2010,. 2016లో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నైరుతి రుతుపవనాలు ముందస్తుగా రావచ్చునని వాతావరణశాఖ తెలిపింది. వర్షాకాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. వాయువ్య, ఈశాన్య, ఆగేయ ద్వీపకల్పంలో తక్కువ వర్షపాతం పడే అవకాశముంది.