Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పతనంతిట్ట (కేరళ): మోడీ ప్రభుత్వానికి బుల్ డోజర్లు ప్రతీకగా మారాయని సీపీఐ (ఏం) పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కరత్ అన్నారు. రాజ్యాంగాన్ని, ప్రాథమిక హక్కులను, వ్యక్తి స్వేచ్ఛను బీజేపీ ప్రభుత్వం బుల్డోజ్ చేస్తోంది. మైనార్టీల పట్ల మోడీ ప్రభుత్వ కక్షపూరిత వైఖరి ఢిల్లీలోని జహంగీర్‌పురిలో మరోసారి స్పష్టంగా బయటపడిందన్నారు.. పతనంతిట్టలో డివైఎఫ్ఐ రాష్ట్ర సదస్సులో ఆమె ప్రసంగిస్తూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బుల్డోజర్లతో ధ్వంసం చేస్తున్నది అంబానీ లేదా అదానీల రాజప్రాసాదాలను కాదు, పేద మైనార్టీలవి అని చెప్పారు.. మతపరమైన వేడుకలు శాంతి,సామరస్యం, సమానత్వ భావన పెంచాలి. అయితే రామ నవమి వేడుకల ముసుగులో ఎనిమిది రాష్ట్రాల్లో ముస్లింలపై సంఫ్‌ు పరివార్ మూకలు దాడులకు తెగబడ్డాయి.. జహంగీర్‌పురిలో మహిళలు, వితంతువులతో సహా ప్రజలు నిర్మించుకున్న ఇళ్లను నేలమటం చేశాయి.. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత దేశంలో మతోన్మాదం వెర్రి తలలు వేస్తోంది. దేశంలో బీజేపీ మనువాద, హిందుత్వ సిద్ధాంతాలను అమలు చేస్తోంది. ఇతర రాష్ట్రాల్లో క్రైస్తవ సమాజంపై దాడులు పెరుగుతున్నాయి. మధ్యప్రదేశ్, కర్ణాటకలో బీజేపీ మతమార్పిడి నిరోధక చట్టాలను ప్రవేశపెట్టింది. వీటన్నింటికీ కాంగ్రెస్ అనుమతి ఇస్తోంది.దేశంలో మోడీ అమలు చేస్తున్నది మేక్ ఇన్ ఇండియా కాదు సేల్ ఇండియా అని ఆమె విమర్శించారు. . ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు రంగానికి విక్రయిస్తున్నారు. భారతదేశంలో జరుగుతున్నది తయారీ కాదు, ప్రభుత్వ ఆస్తుల అమ్మకాలు. రైల్వేలు , ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణే దీనికి నిదర్శనం. డివైఎఫ్ఐ వంటి సంఘాలు మాత్రమే వీటిపై స్పందిస్తున్నాయి. అంబానీ, అదానీల ప్రయోజనాలే బీజేపీ కాంగ్రెస్ లకు ముఖ్యం. దేశంలో చాలా కుటుంబాలకు నెలకు రూ.10,000 కూడా ఆదాయం రాని పరిస్థితి ఒక వైపు ఉంటే, మరో వైపు ఈ కార్పొరేట్లు రోజుకు వేలకోట్ల లాభాలు ఆర్జిస్తున్నారు.నవ కేరళను ముందుకు తీసుకెళ్లేందుకు ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ మూకల దాడులను ఎదుర్కొనేందుకు డివైఎఫ్ఐ తీవ్రంగా కషి చేస్తోందన్నారు.