Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 19 కిలోల సిలిండర్‌పై రూ.102 పెంపు ొ హైదరాబాద్‌లో ధర రూ.2,562
న్యూఢిల్లీ : వాణిజ్య అవసరాలకు వినియోగించే వంటగ్యాస్ ధర మరింత పెరిగింది. ఒక్కో సిలిండర్ (19 కిలోలు)పై రూ.102.50 చొప్పున పెంచుతున్నట్టు ఇంధన సంస్థలు ఆదివారం ప్రకటించాయి. దాంతో హైదరాబాద్‌లో సిలిండర్ ధర రూ.2,562 అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ధర రూ.2,355గా ఉంది. ఐదు కిలోల సిలిండర్ ధర రూ.655కు చేరుకుంది. వాణిజ్య సిలిండర్ల ధరను గత నెలలోనే రూ.250 చొప్పున పెంచారు. ఇప్పుడు మరో రూ.102 చొప్పున బాదేశారు. మార్చిలోనూ సిలిండర్‌పై రూ.105 పెంచారు. దాంతో చిరువ్యాపారులు, హోటల్ యజమానులపై భారం పడింది. నెలకు ఐదు సిలిండర్లు వినియోగిస్తే..రూ.3000 వరకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. అయితే గృహ అవసరాలకు వినియోగించే డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో మాత్రం చమురు సంస్థలు ఈనెల కూడా ఎలాంటి మార్పులు చేయకపోవడం కాస్త ఊరటనిస్తోంది. ప్రస్తుత ధరల ప్రకారం..14.2 కిలోల సిలిండర్ హైదరాబాద్‌లో రూ.1002కి లభిస్తోంది. కోల్‌కతాలో రూ.976, చెన్నైలో రూ.965, ఢిల్లీలో రూ.949, ముంబయిలో రూ.949గా ఉంది.