Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సలహాదారుగా పెట్రోలియం శాఖ మాజీ కార్యదర్శి తరుణ్ కపూర్‌ను నియమించారు. కేంద్ర సిబ్బంది మంత్రిత్వశాఖ ఈ విషయాన్ని సోమవారం వెల్లడించింది. హిమాచల్‌ప్రదేశ్ కేడర్‌కు చెందిన 1987 బ్యాచ్ ఐఎఎస్ అధికారి తరుణ్ కపూర్ 2021 నవంబరు 30న కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వశాఖ కార్యదర్శిగా ఉంటూ పదవీ విరమణ పొందారు. ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఒ)లో ప్రధాని సలహాదారుగా రెండేళ్ల పదవీకాలంతో తరుణ్కపూర్ను నియమించడానికి కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదించిందని మంత్రిత్వశాఖ తెలిపింది. పిఎంఒలో అదనపు కార్యదర్శులుగా సీనియర్ అధికారులు హరి రంజన్‌రావు, అతీష్ చంద్రను నియమించారు.