Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రధాని మోడీపై జిగేశ్ మెవానీ సెటైర్
న్యూఢిల్లీ : తనను అసోం ప్రభుత్వం, పోలీ సులు అరెస్టు చేయడంపై సోమవారం స్పందించిన గుజరాత్ ఎమ్మెల్యే జిగేష్ మెవానీ ప్రధాని మోడీని లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ఏడాది చివరిలో గుజరాత్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర పన్నారని మండిపడ్డారు. 'దీన్ని నేను 56 అంగుళాల (ప్రధాని మోడీ) పిరికిపంద చర్యగా పిలుస్తాను. ఒక మహిళను వినియోగించి నన్ను తప్పుడు కేసులో ఇరికించారు. ఈ కుట్రలో ప్రధాన మంత్రి కార్యాలయం ప్రమేయం ఉంది' అని మేవానీ తెలిపారు. తనకు బెయిల్ మంజూ రు చేసిన అసోం కోర్టు చేసిన వ్యాఖ్యల పట్ల .. హిమంత విశ్వ శర్మ ప్రభుత్వం సిగ్గుపడాలని విమర్శించారు. 'ఏప్రిల్ 19న ఎఫ్ఐఆర్ నమోదైంది. నన్ను అరెస్టు చేసేందుకు అదే రోజు 2,500 కిలోమీటర్లు ప్రయాణించారు. నన్ను నాశనం చేసేందుకు ముందస్తు ప్రణాళికతో చేసిన కుట్ర' అని అన్నారు. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా మెవానీ ట్వీట్ చేశారన్న ఆరోపణలపై గత నెలలో గుజరాత్లో ఉన్న ఆయన్ను అసోం పోలీసులు అరెస్టు చేసిన సంగతి విదితమే. ఏప్రిల్ 25న బెయిల్ పొందగా.. ఓ మహిళా పోలీసు దాఖలు చేసిన కేసులో తిరిగి వెంటనే అరెస్టు అయ్యారు. దీనిపై విచారణ చేపట్టిన అసోం కోర్టు ఇది ప్రణాళిక ప్రకారం జరిగిందని పేర్కొంటూ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.