Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రాజకీయ నాయకుడిగా కొత్త పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు. సొంత రాష్ట్రం బీహార్ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభిస్తానని సోమవారం ఆయన ట్వీట్ చేశారు. 'ప్రజాస్వామ్యంలో అర్థవంతమైన భాగస్వామిగా ఉండాలనే తపనతో పదేండ్లుగా ప్రజానుకూల విధానాన్ని రూపొందించడంలో సాయపడ్డాను. ఇప్పుడు జీవితమనే పేజీని తిరగేస్తుండగా.. రియల్ మాస్టర్ అవ్వాల్సిన సమయం ఆసన్నమైందని గ్రహించాను. ప్రజాసమస్యలు మరింత మెరుగ్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని భావించి... సుపరిపాలన దిశగా అడుగులు వేస్తున్నాను. బీహార్ నుంచి నా ప్రయాణం మొదలు కానుంది' అని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. 'జన్ సురాజ్' పేరిట రాజకీయ పార్టీని పెట్టే అవకాశముందని తెలుస్తోంది. ట్వీట్లో ఆ పేరును ఆయన ప్రస్తావించారు.