Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో వాటాల విక్రయం సోమవారం ప్రారంభమయ్యింది. సంస్థ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) తొలి రోజు యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన వచ్చినట్టు రిపోర్టులు వచ్చాయి. తొలి రెండు రోజులు ఈ వర్గాలకు కేటాయించారు. మే 4 నుంచి 9వ తేది వరకు సాధారణ ప్రజల బిడ్డింగ్‌కు అవకావం కల్పించారు. ఈక్విటీ షేర్ ధరల శ్రేణిని రూ.902-949గా నిర్ణయించారు. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం రూ.5,630 కోట్ల విలువ చేసే షేర్లను కేటాయించారు. తొలి రోజు బిడ్డింగ్‌లో ఎవరి యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్లు విజయవంతమయ్యాయో తెలియాల్సి ఉంది. ఈ ఇష్యూలో రిటైల్ ఇన్వెస్టర్లు, ఉద్యోగులకు రూ.45, పాలసీదారులకు రూ.60 డిస్కౌంట్ ఇస్తున్నారు. కనీసం 15 షేర్లు కొనాల్సి ఉంటుంది. గరిష్టంగా 14 లాట్లు అంటే 210 షేర్లకు దరఖాస్తు చేసుకునే సదుపాయం ఉంది. యాంకర్ బుక్‌లో దాదాపు 20 మంది ఇన్వెస్టర్లు ఆసక్తి చూపినట్టు సమాచారం. ఎల్ఐసీలో రూ.21వేల కోట్ల విలువ చేసే 3 శాతం వాటాలను విక్రయించాలని మోడీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే.