Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం)పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకరత్
- జహంగీర్‌పురి బాధితులకు తోపుడు బండ్లు అందచేత
న్యూఢిల్లీ : ఢిల్లీ జహంగీర్ పురి అల్లర్లలో నష్టపోయిన బాధితులను సీపీఐ(ఎం)పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకరత్ పరామర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఖాకీలను అడ్డం గా చేసుకుని జహంగీర్ పురిలో బుల్డోజర్లతో వీరంగం సృష్టించినపుడు బృందాకరత్ అడ్డుకున్న విషయం విదితమే. స్వయంగా సుప్రీంకోర్టు ఆర్డర్లు ఉన్నా ఎలా కూలుస్తారంటూ నిలదీశారు. ఆ తర్వాత బుల్డోజర్ల ప్రక్రియకు బ్రేక్ పడింది. జహంగీర్‌పురిలోని బాధితులను బృందాకరత్ సోమవారం పరామర్శించారు. వారికి పార్టీ పరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఉపాధి కోల్పోయిన వారికి తోపుడు బండ్లు అందచేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఢిల్లీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ స్థానిక కమిటీ సభ్యులు కూడా పాల్గొన్నారు.