Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ నివేదిక
న్యూఢిల్లీ : మీడియా స్వేచ్ఛలో ఇండియా ర్యాంక్ దిగజారింది. రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్, ఆర్ఎస్ఎఫ్ మంగళవారం వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌ను ప్రచురించింది. దీని ప్రకారం ఇండియాలో పత్రికా స్వేచ్ఛ ర్యాంకింగ్ 2016లో 180 దేశాలలో 133 ర్యాంకులో ఉండగా, 2021 నాటికి 150 ర్యాంకుకు పడిపోయింది.
వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ప్రతి దేశంలో పాత్రికేయులు, వార్తా సంస్థలు, నెటిజన్లకు ఉన్న స్వేచ్ఛను, అటువంటి స్వేచ్ఛను గౌరవించే ప్రభుత్వ ప్రయత్నాలను స్పష్టం చేస్తుంది. గత సంవత్సరం జర్నలిజానికి ''చెడు''గా పరిగణించబడే దేశాల జాబితాలో ఇండియాను పేర్కొంది. ప్రపంచంలోని జర్నలిస్టులకు అత్యంత ప్రమాదకరమైన దేశాల జాబితాలో ఇండియా ఉంది. గతేడాది భారత్ ర్యాంక్ 142.
'జర్నలిస్టులపై హింస, రాజకీయంగా పక్షపాత మీడియా, మీడియా యాజమాన్యం కేంద్రీకృతం ఇవన్నీ బీజేపీ నేత, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 2014 నుంచి పాలిస్తున్న ''ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం''లో పత్రికా స్వేచ్ఛ సంక్షోభంలో ఉందని నిరూపిస్తున్నాయి. హిందూ జాతీయవాద మితవాద స్వరూపం'' అని నివేదికలో పేర్కొంది.
''వాస్తవానికి వలసవాద వ్యతిరేక ఉద్యమంలో ఇండియాలో పత్రికలు చాలా ప్రగతిశీలమైనవిగా ఉన్నాయి. అయితే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. మీడియాపై బీజేపీ ఆధిపత్యం చెలాయిస్తుంది. దీనికి ఉదాహరణ ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండిస్టీస్ గ్రూప్, ఇప్పుడు మోడీకి వ్యక్తిగత స్నేహితుడు. కనీసం 800 మిలియన్ల మంది భారతీయులు అనుసరించే 70 కంటే ఎక్కువ మీడియా సంస్థలను కలిగి ఉన్నారు'' అని తెలిపింది.
''కరోనాతో పోరాడే ముసుగులో ప్రభుత్వం, దాని మద్దతుదారులు అధికారిక ప్రకటనలకు విరుద్ధంగా ఉన్న మీడియా సంస్థలపై వ్యాజ్యాలు గెరిల్లా యుద్ధాన్ని ఎలా సాగించారు'' అని తెలిపింది. కరోనాపై రిపోర్టింగ్ చేసినందుకు 55 మంది జర్నలిస్టులను అరెస్టు చేసి, కేసులు నమోదు చేసి, బెదిరించారని వివిధ మీడియా నివేదికలున్నాయి'' అని తెలిపింది. ప్రభుత్వాన్ని విమర్శించే జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వేధింపుల గురించి రిపోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం 13 మంది జర్నలిస్టులు కటకటాల్లో ఉన్నారు. జనవరి 1 నుంచి ఒక జర్నలిస్టు హత్యకు గురయ్యారు.