Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ విమర్శలు.. తిప్పికొట్టిన కాంగ్రెస్
న్యూఢిల్లీ : కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ నేపాల్‌లోని ఓ నైట్ క్లబ్లో పార్టీ చేసుకుంటున్నట్టుగా ఉన్న వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ వీడియోలో నేపాల్‌లోని చైనా రాయబారి కూడా ఉన్నట్టు వార్తలు రావడంతో బీజేపీ విమర్శలకు దిగింది. వివరాల ప్రకారం.. ఒక జర్నలిస్టు ఫ్రెండ్ వివాహానికి హాజరయ్యేందుకు రాహుల్ సోమవారం నేపాల్ వెళ్లారు. రాహుల్ తన స్నేహితులతో కలిసి ఖాట్మాండులోని మారియట్ హౌటల్లో బస చేశారు. ఈ వీడియోను బీజేపీ నేత కపిల్ మిశ్రా తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అలాగే బీజేపీ ఐటి కన్వీనర్ అమిత్ మాల్వియా ఈ వీడియోను పోస్ట్ చేస్తూ 'కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు రాహుల్ విదేశాల్లో నైట్‌క్లబ్‌ల్లో పార్టీ చేసుకుంటున్నారు' అని విమర్శించారు. బీజేపీ విమర్శలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. మిత్ర దేశంలో స్నేహితుడి పెళ్లికి వెళ్లడం నేరమేమీ కాదని పేర్కొంది. 'ప్రధాని మోడీ మాదిరిగా రాహుల్ గాంధీ ఏం పాకిస్థాన్‌లోని పిలవని వేడుకకు వెళ్లి నవాజ్ షరీఫ్‌తో కేక్ కట్ చేయలేదు కదా. జర్నలిస్టు ఫ్రెండ్ వివాహానికి హాజరయ్యేం దుకు మిత్ర దేశమైన నేపాల్ వెళ్లారు. ఇందులో తప్పేం లేదు. ఇదేం నేరం కాదు' అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా చెప్పారు. అలాగే మోడీ యూరప్ పర్యటనను ఉద్దేశించి 'దేశం సంక్షోభంలో ఉంటే.. సాహెబ్ విదేశాల్లో ఉన్నారు' అని కాంగ్రెస్ విమర్శించింది.