Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23) తొలి మాసం ఏప్రిల్లో తయారీ రంగం సానుకూల పెరుగుదలను నమోదు చేసింది. ఎస్అండ్పి గ్లోబల్ ఇండియా మానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పిఎంఐ) ఏప్రిల్లో 54.7కు పెరిగింది. ఈ సూచీ మార్చిలో 54 వద్ద నమోదయ్యింది. పిఎంఐ సూచీ 50 పైనుంటే వద్ధికి సంకేతంగా, దిగువకు పడిపోతే క్షీణతగా విశ్లేషిస్తారు. ద్రవ్యోల్బణ పెరుగుదల ఒత్తిళ్లలోనూ ఉత్పత్తి, ఫ్యాక్టరీ ఆర్డర్లు, అంతర్జాతీయ అమ్మకాల్లో పురోగతి తదితర అంశాలు తయారీకి మద్దతునిచ్చాయని వెల్లడించింది. కరోనా సంబంధ పరిమితులు, ఆంక్షలు సడలింపు కూడా సూచీ పురోగతికి దోహదపడ్డాయని పేర్కొంది. అమ్మకాలు, ముడి పదార్థాల కొనుగోలులో కొనసాగుతున్న పెరుగుదల వద్ధిని సూచిస్తోందని ఎస్అండ్పి గ్లోబల్లో ఎకనామిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలియన్నా డి లిమా తెలిపారు. తయారీ సూచీ సమీప కాలంలో నిలదొక్కుకుంటుందని భావిస్తున్నామని ఆమె పేర్కొన్నారు.