Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరింత రాయితీని కోరుతున్న భారత్
న్యూఢిల్లీ : రష్యా నుంచి ఇంధన కొనుగోళ్లపై మరిన్ని రాయితీలను పొందేందుకు భారత్ యత్నిస్తోంది. పెట్రోలియం ఎగుమతి దేశాల కూటమి (ఓపీఈసీ)నుంచి ఇతర దేశాలు దూరంగా ఉండటంతో భారత్ ఈ దిశగా యత్నిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రెండు దేశాల మధ్య ఉన్నత స్థాయి చర్చల్లో కొనుగోళ్లకు పెట్టుబడి పొందడం వంటి అడ్డంకులను భర్తీ చేసేందుకు సరఫరా ప్రాతిపదికన రష్యా నుంచి ఒక్కో బ్యారెల్‌పై 70 డాలర్లు కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయాలని భారత్ కోరుకుంటోందని ఆ వర్గాలు తెలిపాయి. గ్లోబల్ బెంచ్ మార్క్ ప్రకారం.. ప్రస్తుతం ఒక్కో బ్యారెల్ 105 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యలు చేపట్టినప్పటి నుండి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతి దారు అయిన భారత్, ఇతర ప్రైవేట్ సంస్థలు 40 మిలియన్ బ్యారెల్స్ కన్నా అధికంగా దిగుమతిచేసుకుందని ఆ వర్గాలు తెలిపాయి.
2021 మొత్తంలో రష్యా నుండి భారత్‌కు దిగుమతి అయిన ఇంధనం కన్నా 20 శాతం అధికమని బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం.. వాణిజ్య శాఖ తెలిపింది.