Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర హౌం మంత్రి అమిత్ షా
కోల్కతా : దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తర్వాత పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలు చేస్తామని కేంద్ర హౌం శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో వివాదాస్పద సీఏఏపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. '' సీఏఏ అమలు ఉండదని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) గాలి వార్తలను వ్యాప్తి చేస్తున్నది. కోవిడ్-19 మహమ్మారి అంతమయ్యాక సీఏఏ అమలు ఉంటుందని నేను స్పష్టం చేస్తున్నాను'' అని అమిత్ షా అన్నారు. 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రెండు రోజుల పర్యటన నిమిత్తం తొలిసారిగా ఆయన రాష్ట్రానికి వచ్చారు. ఉత్తర బెంగాల్లోని సిలిగురిలోని బహిరంగ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న రాజకీయ హింస విషయంలో మమత సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మమత మూడో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో హింస ఏ మాత్రమూ తగ్గలేదని ఆరోపించారు. టీఎంసీపై బీజేపీ పోరాటాన్ని కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.