Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విధ్వంసానికి ఖలీస్థానీ సంస్థ వ్యూహం..
- హర్యానాలో నలుగురి అరెస్టు.. భారీగా పేలుడు పదార్థాల స్వాధీనం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు చోట్ల భీకర పేలుళ్లకు ముష్కరులు పన్నిన కుట్రను పోలీసులు భగం చేశారు. భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు తెలంగాణకు తరలించేందుకు యత్నించిన నలుగురు ఖలీస్థానీ ఉగ్రవాదులను గురువారం అరెస్టు చేశారు. వీరికి పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. నిఘా వర్గాల సమాచారం మేరకు తెలంగాణ, పంజాబ్, హర్యానా పోలీసులు సంయుక్త అంతర్రాష్ట్ర ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో హర్యాలోని కర్నాల్ ప్రాంతంలో ఓ టోల్ ప్లాజా వద్ద అనుమానిత ఇన్నోవా ఎస్‌యూవీని అధికారులు గుర్తించారు. ఆ వాహనాన్ని తనిఖీ చేయగా.. భారీ ఎత్తున ఆయుధాలు కన్పించాయి. ఇందులో ఐఈడీలు, ఆర్డీఎక్స్, 30 కాలిబర్ పిస్టళ్లు కూడా ఉన్నాయి. దీంతో వాహనంలోని నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. పంజాబ్‌కు చెందిన వీరిని ఖలిస్థానీ ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నారు. ఈ అయుధాలను తెలంగాణ, మహారాష్ట్రకు తరలించేందుకు తీసుకెళ్తున్నట్టు అధికారులు గుర్తించారు.వీరిని విచారించగా అనేక కీలక విషయాలు బయటపడ్డాయి. ఈ ఆయుధాలను డ్రోన్ల ద్వారా దేశ సరిహద్దుల నుంచి తీసుకున్నట్టు తెలిపారు. వీటిని దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నామని నిందితులు చెప్పినట్టు తెలుస్తోంది. పాకిస్థాన్‌కు చెందిన ఖలిస్థానీ ఉగ్రవాది హర్జిందర్ సింగ్ రిండా వీటిని పంపినట్టు అధికారులు తెలిపారు.