Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్-19 వ్యాక్సిన్లపై 'సుప్రీం'కు అవాస్తవాలు
- వ్యాక్సిన్లను ఎన్టీఏజీఐ ఆమోదించలేదు
న్యూఢిల్లీ : దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ తప్పనిసరి చేయటం కుదరదని భారత అత్యున్నత న్యాయస్థానం ఈనెల 2న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ వార్త తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా, ఒక పిటిషన్‌కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కొన్ని స్పందనలు సుప్రీంకోర్టు ఉత్తర్వులకు కారణమైందని నిపుణులు తెలిపారు. అలాగే, ఇందులో భారత్‌లోని కోవిడ్-19 వ్యాక్సిన్ డ్రైవ్‌ను దెబ్బతీసేలా కొన్ని అబద్ధాలు ఉన్నాయని చెప్పారు. దీనికి సంబంధించి పిటిషనర్, నేషనల్ టెక్నికల్ అడ్వైజరీగ్రూపు (ఎన్టీఏజీఐ) సభ్యులు జాకొబ్ పులియెల్ కొన్ని వాదనలను వినిపించారు. వివిధ వ్యాక్సిన్లను ఆమోదించే విషయంలో ప్రభుత్వ నిర్ణయాలు పారదర్శకంగా లేవని ఆయన చెప్పారు. సంబంధిత సమాచారాన్ని ప్రతిసారీ ఎన్టీఏజీఐ ముందు ప్రవేశపెట్టలేదన్నారు. కార్బెవ్యాక్సపై 'ది వైర్' వార్త కథనాన్ని ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు.
ఎన్టీఏజీఐ ఆమోదం లేకుండానే 12 నుంచి 14 ఏండ్ల మధ్య ఉన్న పిల్లలకు వ్యాక్సిన్ వినియోగానికి కేంద్రం పచ్చజెండా ఊపిందన్నది దీని సారాంశం. అయితే, కేంద్రం మాత్రం అన్ని వ్యాక్సిన్లను ఎన్టీఏజీఐ ఆమోదించిందని సుప్రీంకోర్టుకు తెలిపింది. ఎన్టీఏజీఐ మీటింగ్స్ సమగ్ర సమాచారాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వెబ్సైట్లలో పొందుపర్చినట్టు కేంద్ర ప్రతినిధి ఒకరు వెల్లడించారు కూడా. అయితే, ఈ రెండు విషయాలూ అబద్ధమని సదరు వార్త సంస్థ తన కథనంలో వివరించింది. మొదటిది.. ఏ ఒక్క వెబ్సైట్లోనూ సమగ్ర సమాచారాన్ని పొందుపర్చలేదని పేర్కొన్నది.