Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జమ్ము : జమ్ముకాశ్మీర్లోని సాంబ జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి సొరంగాన్ని బీఎస్ఎఫ్ గుర్తించింది. భారత్లో ప్రవేశించేందుకు పాకిస్థాన్ ఆధారిత జైషీ-ఈ-మహమ్మద్ (జేఈఎం)కు చెందిన ఇద్దరు ఆత్మాహుతి సభ్యులు ఈ సొరంగాన్ని ఉపయోగించుకునిఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. అంతర్జాతీయ సరిహద్దులో ఇలాంటి సొరంగాన్ని బీఎస్ఎఫ్ కనుగొనడం 16 నెలలు తరువాత ఇదే మొదటిసారి. గత 10 ఏళ్లలో మొత్తంగా 11 సొరంగాలను గుర్తించారు. 2021లో కతౌవా జిల్లాలో హిరానగర్ సెక్టార్లో రెండు సొరం గాలను గుర్తించారు. బుధవారం సాంబ జిల్లాలో సాయంత్రం 5:30 గంటల సమయంలో యాంటీ టన్నెలింగ్ డ్రైవ్లో భాగంగా ఈ సొరంగాన్ని గుర్తించినట్టు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. 'అంతర్జాతీయ సరిహద్దుకు 150 మీటర్ల దూరంలో సరిహద్దు కంచె నుండి 50 మీటర్ల దూరంలో కొత్తగా తవ్విన ఈ సొరం గం పాకిస్థాన్ మిలటరీ పోస్టుకు ఎదురుగా కనుగొనబడింది. ఇది భారత్ వైపు నుంచి 900 మీటర్ల దూరంలో ఉంది' అని ఒక అధికారి చెప్పారు. ఏప్రిల్ 22న జమ్ములోని సుంజ్వాన్ ప్రాంతంలో ఉగ్రదాడి జరగడంతో సరిహద్దు ప్రాంతంలో బిఎస్ఎఫ్ తనిఖీలను ముమ్మరం చేసింది. ఇందులో సెంట్రల్ ఇండిస్టీయల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) సిబ్బంది సహకారాన్ని కూడా తీసుకుంటున్నారు. ఏప్రిల్ 22న సీఐఎస్ఎఫ్ బస్సుపై దాడిలో ఒక ఎఎస్ఐ మరణించారు. ఈ ఘటనలో జెఇఎంకు చెందిన ఇద్దరు ఆత్మహుతి సభ్యులు హతమయ్యారు.