Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదేండ్ల నాటి కేసులో దోషిగా తేల్చిన కోర్టు
గాంధీనగర్ : గుజరాత్ ఎమ్మెల్యే, దళిత నేత జిగేష్ మెవానీని కేంద్రం వేధింపులకు గురిచేస్తూనే ఉంది. తాజాగా గురువారం ఆయన పోలీసులు మరోసారి అరెస్టుచేశారు. ఐదేండ్ల క్రితం జరిపిన 'అజాదీ మార్చ్' కేసులో మెవానీ సహా తొమ్మిది మందిని దిగువ కోర్టు నిందితులుగా పేర్కొంది. 2017 జులైలో బనస్కాంత జిల్లాలోని మెహసానా నుంచి ధనేరా వరకు మేవానీతో పాటు తొమ్మిది మంది ఆజాది మార్చ్ పేరుతో ర్యాలీ నిర్వహించారు. అయితే ఈ ర్యాలీకి పోలీసుల అనుమతి తీసుకోలేదనీ, చట్టవిరుద్ధంగా సమావేశాన్ని నిర్వహించారంటూ వారిని దోషులుగా నిర్థారించింది. దీంతో వీరందరికీ మూడు నెలల జైలుశిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ. వెయ్యిరూపాయల జరిమానా విధించింది. గత ఏప్రిల్ నెలలో మెవానీని అసోం పోలీసులు రెండు సార్లు అరెస్ట్ చేశారు. ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ట్వీట్ చేశారంటూ అస్సోం పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్పై విడుదలైన వెంటనే మహిళా కానిస్టేబుల్ను వేధించారంటూ మరోసారి అసోం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండో కేసులో గతవారం బెయిల్ లభించగా శనివారం విడుదలయ్యారు. ఉనా కేసులో దళితులపై బనాయించిన కేసులను ఉపసంహరించుకోవాలని లేకుంటే జులై 1న రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని మంగళవారం గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్వహించిన భారీ రోడ్ షోలో కేంద్రాన్ని హెచ్చరించారు.