Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాతావరణంలోకి అదనంగా ఊష్ణశక్తి వచ్చిపడుతోంది : నాసా
న్యూఢిల్లీ : బాబోయ్..ఇదేమి ఎండ, ఈస్థాయిలో మునుపెన్నడూ లేదు..అంటూ ప్రతిఒక్కరూ ఎండలతాకిడికి హడలిపోతున్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ 'నాసా' కూడా ఇదే విషయాన్ని తాజాగా ప్రస్తావించింది. మార్చి 2021-ఫిబ్రవరి 2022మధ్య కాలంలో మునుపెన్నడూ లేనంత వేగంగా, రికార్డ్‌స్థాయిలో భూమి వేడెక్కిందని 'నాసా' కొన్ని గణాంకాల్ని విడుదల చేసింది. భూమిపై అదనంగా వచ్చిన పడిన ఊష్ణశక్తితో సముద్రాలు, భూమి, వాతావరణం వేడెక్కాయని, మంచు కరిగి సముద్ర మట్టాలు పెరిగాయని నివేదిక పేర్కొన్నది. ప్రతి చదరపు మీటర్‌కు 1.64 వాట్ పవర్ వేగంతో అనూహ్యంగా భూమి వేడెక్కుతోంది. కొన్ని లక్షల హిరోషిమా బాంబుల ప్రయోగంతో ఇది సమానమని నాసా శాస్త్రవేత్తలు చెప్పారు. భారత్‌లో ఈ ఎండాకాలం ఉష్ణోగ్రతలు రికార్డ్‌స్థాయిలో నమోదవుతున్నాయి.