Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రపంచ దేశాలు భారతదేశ అభివద్ధి ప్రణాళికలను తమ లక్ష్యాలను సాధించే సాధనాలుగా పరిగణిస్తున్నాయని ప్రధాని మోడీ తెలిపారు. ప్రపంచ సంక్షేమం కోసం భారత్ భారీ లక్ష్యంతో ముందుకు సాగుతున్నదని అన్నారు. శుక్రవారం జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జేఐటీఓ) ప్రారంభ సెషన్లో ప్రధాని ప్రసంగించారు. ప్రపంచ శ్రేయస్సు, ప్రపంచ శాంతి, ఇతర సవాళ్లకు సంబంధించిన పరిష్కారాల కోసం ప్రపంచం భారత్ వైపు చూస్తోందని అన్నారు. ప్రతిభ, వాణిజ్యం, సాంకేతిక పరిజ్ఞానాలకు భారత్ అధిక ప్రోత్సాహం అందిస్తోందని అన్నారు. దేశంలో ప్రతిరోజు డజన్ల కొద్ది స్టార్టప్‌లను నమోదు చేస్తోందని చెప్పారు. నైపుణ్యం కావచ్చు, ఆందోళనలు కావచ్చు, అభిప్రాయ భేదాలు కావచ్చు ఏవైనా నూతన భారత్ ఆవిర్భావం వాటన్నింటినీ ఏకం చేస్తుందని చెప్పారు. దీంతో భారత్ ప్రపంచ సంక్షేమం కోసం పెద్ద లక్ష్యాన్ని స్వీకరించిందని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారని అన్నారు.