Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గోరక్షకులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరోపణలు
గుర్గ్రామ్ : తనను అసెంబ్లీలోకి అడుగుపెట్టవద్దంటూ గోరక్షకులు తనపై బెదిరింపులకు పాల్పడ్డారంటూ హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యే మమ్మన్ఖాన్ ఆరోపించారు. తనకు, తన కుటుంబసభ్యులకు ఏదైనా ప్రమాదం జరిగితే అందుకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వుంటుందన్నారు. విధ్వంసాలకు పాల్పడుతున్న గోరక్షకులను తమ గ్రామంలోకి అనుమతించేది లేదంటూ ఇటీవల తాను చేసిన ప్రకటన నేపథ్యంలోనే వారు ఈ బెదిరింపులకు దిగుతున్నారని తెలిపారు. అసెంబ్లీలోకి ఎలా అడుగుపెడతావో చూస్తామంటూ గోరక్షకులు బెదిరింపులకు దిగారని అన్నారు. ఈ వ్యవహారంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, హోం మంత్రి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్లకు లేఖ రాసినట్టు తెలిపారు. ఈ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యేకు రక్షణ లేకపోతే ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటని కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రశ్నించారు.