Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఇద్దరు న్యాయమూర్తులను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం సుప్రీంకోర్టుకు సిఫారసు చేసింది. గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుధాన్షు ధులియా, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జంషెడ్ బుర్జోర్ పార్ధివాలాలను సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఉత్తరాఖండ్‌కి చెందిన జస్టిస్ సుధాన్షు ధౌలియా 1986లో అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్‌లో చేరారు. 2000లో ఉత్తరాఖండ్ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన సమయంలో ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, అనంతరం అదనపు అడ్వకేట్ జనరల్‌గా విధులు నిర్వహించారు. అసోం, మిజోరాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా విధులు నిర్వహించారు. జంషెడ్ బుర్జోర్ నాల్గవ తరం న్యాయ నిపుణుడు, 1990లో గుజరాత్ హైకోర్టులో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. అతను 2002లో గుజరాత్ హైకోర్టుకు స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు ప్రస్తుత న్యాయమూర్తుల సంఖ్య 32గా ఉంది. ఇద్దరి నియామకంతో పూర్తి మెజారిటీ 34ని చేరుకున్నప్పటికీ.. జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ నాగేశ్వరరావ్లు పదవీవిరమణ చేయనుండటంతో మరో రెండ్ పదవులు ఖాళీ కానున్నాయి.