Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వంట గ్యాస్ ధర రూ. 50 పెంపు
- హైదరాబాద్‌లో..రూ..1,052
న్యూఢిల్లీ: మోడీ ప్రభుత్వం సామాన్య, మధ్యతరగతి ప్రజల్ని బతకనీయటంలేదు. చమురు ధరల భారాలు మోపుతున్న కేంద్రం,,ఇపుడు గ్యాస్ సిలిండర్ల ధరల్ని పెంచేసింది. తాజాగా వంట గ్యాస్ ధరపై మరో రూ.50 బాదేసింది. దీంతో 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ రూ.1,000 దాటనుంది. జాతీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు శనివారం 14.2 కిలోల సిలిండర్ ధరను రూ.50 పెంచాయి. దీనివల్ల .గృహ వినియోగానికి వాడే వంట గ్యాస్ పై ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. రెండు నెలల్లో రెండోసారి వంటగ్యాస్ ధర పెరిగింది. పెరుగుదల కారణంగా చెన్నై, కొల్కతా లో గృహౌపకరణాల వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.1,000 కంటే ఎక్కువ పెరిగింది. అదే సమయంలో ఢిల్లీ, ముంబాయిలో రూ.999.50కి చేరుకుంది. గతంలో మార్చి 22న పెరిగినప్పటి నుంచి హైదరాబాద్‌లోని కుటుంబాలు రూ.1,000 కంటే ఎక్కువ చెల్లిస్తున్నాయి. ఇప్పుడు సిలిండర్‌కు రూ.1,052 ఖర్చు చేయాల్సి ఉంటుంది.పాల నుంచి వంట నూనె వరకు రోజువారీ వినియోగ వస్తువుల ధరలు పెరగడం, పెట్రోలు, డీజిల్ ధరల పెరగడంతో ప్రయాణాలపై పెరిగిన వ్యయం కారణంగా గృహ బడ్జెట్ అధికం అవ్వటంతో ఇప్పటికే ఒత్తిడికి గురవుతున్న తరుణంలో వంటగ్యాస్ ధరల పెరుగుదలతో మరింతగా భారాన్ని పెంచింది. 14.2 కిలోల సిలిండర్ ధర పెరగడంతో చెన్నైలో రూ. 1,015.50, కొల్కతాలో రూ.1,026 ఉంటుంది. ఇప్పటికే మే 1న 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.100 కంటే ఎక్కువ పెరిగింది.