Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడుగురు మృతి
ఇండోర్ : మధ్యప్రదేశ్లోని ఇండోర్లో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక మహిళసహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. తొమ్మిది మంది గాయాల పాలయ్యారు. విజరునగర్ ప్రాంతంలోని మూడంతస్తుల భవనాన్ని ఒక్కసారిగా పొగ కమ్మేసింది. అప్పటికే అక్కడున్న సుమారు 16 మంది అందులో చిక్కుకున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ప్రధాన ద్వారం, మెట్ల చుట్టూ ఉన్న ప్రాంతం మంటలకు వేడిగా మారిపోవడంతో, వారు కిందకు చేరుకోవడానికి ఇబ్బందులు పడ్డారు. కొంతమంది తమ బాల్కనీలోకి పరుగెత్తారు. సమాచారం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ఇండోర్ పోలీస్ కమిషనరు హరి నారాయణ్ చారి మిశ్రా, డీసీపీ సంపత్ ఉపాధ్యాయ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఎలక్ట్రిక్ మీటర్లో షార్ట్ సర్క్యూట్ వల్ల భవనంలోని మూడో అంతస్తులో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుందని పేర్కొన్నారు. భవనం మొత్తం పొగ కమ్మేయడంతో ఊపిరాడక ఏడుగురు మరణించారని, తొమ్మిది మంది గాయపడ్డారని తెలిపారు. భవనంలో ఎలాంటి ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లూ లేవని ప్రత్యక్ష సాక్షులు తెలిపారన్నారు. భవన యజమానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. విజయనగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ తెV్ాజీబ్ ఖాజీ మాట్లాడుతూ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో దట్టంగా పొగలు కమ్మాయని చెప్పారు. గ్రౌండ్ ఫ్లోర్లోని వాహనాల పార్కింగ్ ప్రాంతంలోనూ పొగలు కమ్మేశాయని తెలిపారు. దీంతో, ఆ వాహనాలను బయటకు తరలించామని చెప్పారు.