Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్లోని సియోని జిల్లాలో ఇద్దరు గిరిజన యువకుల హత్యను అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) తీవ్రంగా ఖండించింది: ఈ క్రూరమైన నేరానికి పాల్పడిన భజరంగ్ దళ్, శ్రీరామ్ సేన కార్యకర్తలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. సియోని జిల్లా సిమారియా,సాగర్ గ్రామాలకు చెందిన గిరిజన యువకులు ధన్సాయి ఇన్వతి,సంపత్లాల్ వట్టిపై ఆధారపడి వారి కుటుంబాలు జీవిస్తున్నాయి.గోహత్య చేశారని ఆరోపిస్తూ బజరంగ్ దళ్, శ్రీరామ్ సేన గూండాలు సుమారు 20మంది ఈ నెల 2న బహిరంగంగా దాడి చేసి, హత్య చేశారనిఏఐకేఎస్ విమర్శించింది. ఈ ఘటన దిగ్భ్రాంతికరమని పేర్కొంది.మధ్యప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వ హయాంలో గోగూండాలకు పాలనా యంత్రాంగం రక్షణగా ఉందని ఈ ఘటన తెలియజేస్తోందని తెలిపింది. అట్టడుగు వర్గాలపై జరుగుతున్న ఈ దాడులు లౌకికవాదానికి, సామాజిక న్యాయానికి, దేశ సమైక్యతకు పెను ముప్పు అని తెలిపింది. ఈ హత్యలకు పాల్పడిన భజరంగ్ దళ్, శ్రీరామ సేన గూండాలను తక్షణమే అరెస్టు చేసి, వారిపై చర్యలు తీసుకోవాలని, హత్యకు గురైన ఇద్దరు గిరిజనుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేసింది. ఈ హత్యలకు వ్యతిరేకంగా దేశంలోని అన్నిఏఐకేఎస్ నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చింది.