Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సుప్రీం కోర్టుకు మరో ఇద్దరు న్యాయమూర్తులను నియమించారు. దీంతో, 34 మంది న్యాయమూర్తులతో సుప్రీంకోర్టు పూర్తి సామర్థ్యాన్ని సంతరించుకుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ నేతృత్వంలోని కొలీజియం గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుధాన్షు ధులియా, గుజరాత్ హైకోర్టుకు చెందిన జస్టిస్ జంషెడ్ బీ పార్దివాలా పేర్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవుల కోసం ఈ నెల5న సిఫార్సు చేసింది. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ వారి నియామకాలను ధ్రువీకరిస్తూ శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. జస్టిస్ ్త సుధాన్షు ధులియా స్వస్థలం ఉత్తరాఖండ్‌లోని పౌరి గర్వాల్ జిల్లా మదన్ పూర్ గ్రామం. మరో న్యాయమూర్తి జస్టిస్ జంషెడ్ బీ పార్దివాలా పుట్టింది ముంబయిలో అయినా చదువంతా గుజరాత్లో వల్సాద్ టౌన్లో జరిగింది. ఈ ఇద్దరి నియామకంతో సుప్రీం కోర్టులో ఖాళీలు పూర్తిగా భర్తీ అయింది. అయితే, త్వరలో ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ వినీత్ శరణ్ (మే10), .జస్టిస్ నాగేశ్వరరావు (జూన్7) రిటైర్ కానున్నందున మళ్లీ రెండు ఖాళీలు ఏర్పడనున్నాయి.