Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 3,451 కొత్త కేసులు వెలుగుచూశాయని,40 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఢిల్లీ, మహారాష్ట్రల నుంచే అత్యధిక కేసులు నమోదయ్యాయి. మొత్తం మరణాల సంఖ్య 5,24,064కు, కేసుల సంఖ్య 4,31,02,194కు చేరింది. శనివారం కరోనా నుంచి 3,079 మంది కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు సంఖ్య 20,635 (0.05%)గా ఉంది.