Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : వంట గ్యాస్ సిలిండర్ ధర పెరగడంతో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెరిగిన నేపథ్యంలో ఆయన ఆదివారం ఓ ట్వీట్ చేశారు. యుపిఎ ప్రభుత్వ హయాంలో వంట గ్యాస్ సిలిండర్ ధరలను, ప్రస్తుత బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వ హయాంలో ధరలతో పోల్చి చూపించారు. 14.2 కేజీల గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్ ధర 2014 మే నెలలో రూ.410 ఉండేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్క సిలిండర్‌పై రూ.827 రాయితీ ఇచ్చిందని, ప్రస్తుత మోడీ ప్రభుత్వం రాయితీ ఇవ్వడం లేదని విమర్శించారు. అప్పటి ధర ప్రకారం రెండు సిలిండర్లను కొనగలిగే సొమ్ముకు ఇప్పుడు ఒక సిలిండర్ మాత్రమే వస్తోందని పేర్కొన్నారు.