Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం
న్యూఢిల్లీ : రాజద్రోహం చట్టం విషయంలో కేంద్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. చట్టంలోని నిబంధనల(సెక్షన్ 214ఏ)ను పున :పరిశీలిస్తామనీ, మార్పులకు అవకాశ ముందని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. బ్రిటిష్ కాలం నాటి ఈ చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను పరిశీలనకు తీసుకోవద్దని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది. కేంద్ర ప్రభుత్వం మార్పుల కసరత్తును పూర్తి చేసేంత వరకు వేచివుండాలని విజ్ఞప్తి చేసింది. కాగా దేశద్రోహ చట్టాల రాజ్యాంగ చట్టబద్ధతను సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్లను ఈ నెల 10 (మంగళవారం) నుంచి విచారణకు స్వీకరిస్తామని గతంలో సుప్రీంకోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు అఫిడవిట్‌ను దాఖలు చేసింది. మూడు పేజీలతో కూడిన అఫిడవిట్‌ను కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో దాఖలు చేసింది. కాలం చెల్లిన చట్టాలను తొలగించడంతోపాటు దేశ సౌర్వభౌమత్వం, రక్షణకు కట్టుబడి ఉన్నామని అఫిడవిట్లో పేర్కొంది. దేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న వేళ బ్రిటిష్ కాలంనాటి చట్టాలను మూలనపడేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని పేర్కొంది.