Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాలర్‌తో 77.46కు పతనం
ముంబయి : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో రూపాయి విలువ వెలవెలపోతున్నది. సోమవారం ఓ దశలో అమెరికా డాలర్‌తో రూపాయి విలువ ఏకంగా 77.58కు పడిపోయింది. తుదకు 52 పైసలు కోల్పోయి 77.46కు క్షీణించింది. రూపాయి చరిత్రలోనే ఇది అతి గరిష్ట స్థాయి పతనం కావడం గమనార్హం. మార్చి ఏడో తేదీన రూపాయి విలువ ఆల్‌టైం కనిష్ట స్థాయి 76.98 వద్ద నమోదయ్యింది. దేశంలో అధిక ద్రవ్యోల్బణం, స్టాక్ మార్కెట్ల పతనం, అంతర్జాతీయ ప్రతికూల అంశాలు రూపాయి విలువను ఒత్తిడికి గురి చేస్తున్నాయి.