Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజద్రోహ చట్టంపై కేంద్రానికి సుప్రీంకోర్టు అల్టిమేటం
- కేసులపై చర్యలను తాత్కాలికంగా నిలిపేయాలని భావిస్తున్నారా? లేదా? చెప్పాలని ఆదేశం
న్యూఢిల్లీ : రాజద్రోహ చట్టం (ఐపీసీ సెక్షన్ 124ఏ) యథేచ్ఛగా దుర్వి నియోగమవుతోందని పెద్దఎత్తున నిరసన వ్యక్తమవుతున్న తరుణంలో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి 24 గంటల గడువు ఇచ్చింది. వివాదాస్పద సెక్షన్ను సమీక్షించాలని ప్రభుత్వం ప్రతిపాదించడంతో... ఈ ప్రక్రియ పూర్త య్యే వరకు ప్రస్తుతం నమోదైన రాజద్రోహం కేసులపై తదుపరి చర్యలను తాత్కాలికంగా నిలిపేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేయాలని భావిస్తున్నదా? లేదా? 24 గంటల్లో తెలియ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంగళవారం ఆదేశించింది. రాజద్రోహం చట్టాన్ని పున్ణపరిశీలించేంత వరకు విచారణను వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. రాజద్రోహ చట్టాన్ని పున్ణపరిశీలించేందుకు ఎంతకాలం పడుతుందనీ, దీని దుర్వినియోగాన్ని ప్రభుత్వం ఏ విధంగా పరిష్కరిస్తుందని కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. బ్రిటిష్ కాలం నాటి ఈ చట్టాన్ని పున్ణసమీక్షిస్తున్నామని చెప్తూ, ఈ అంశంపై దాఖలైన పిటిషన్లపై విచారణను కొనసాగించవద్దని కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టును కోరిన సంగతి తెలిసిందే. పున్ణ పరిశీ లన జరుగుతోందని మెహతా చెప్పినపుడు సుప్రీంకోర్టు స్పందిస్తూ.. రాజద్రో హం చట్టం దుర్వినియోగమవుతున్నదని ఆందోళన ఉందని పేర్కొంది. ఐపీసీ సెక్షన్ 124ఏపై పున్ణపరిశీలన ప్రక్రియను మూడు, నాలుగు నెలల్లో పూర్తి చేయాలనీ, అప్పటి వరకు ఈ సెక్షన్ ప్రకారం దాఖలైన కేసుల్లో తదుపరి చర్యలను చేపట్టకుండా తాత్కాలికంగా నిలిపేయాలని ఆదేశించింది.