Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ (ఎల్ఐసీ) ఐపీఓ షేర్ల కేటాయింపుపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. షేర్ల కేటాయింపుపై స్టే విధించాలని కోరుతూ కొందరు పాలసీదారులు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. వాణిజ్య పెట్టుబడులు, ఐపీఓ అంశాలపై మధ్యంతర ఉపశమనం కలిగించలేమని జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ పి.ఎస్.నరసింహాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. మేము ఎటువంటి మధ్యంతర ఉపశమనాన్ని మంజూరు చేయడానికి మొగ్గు చూపడం లేదని తెలిపింది. ఈ పిటిషన్లపై ఎనిమిదిరోజులుగా తమ స్పందనను తెలియజేయాల్సిందిగా ఎల్ఐసీ, కేంద్రాన్ని ఆదేశించింది. ఆర్థిక చట్టం, 2021ని మనీ బిల్లుగా ఆమోదించే అంశంపై రాజ్యాంగ ధర్మాసనానికి సూచించిన పెండింగ్లో ఉన్న పిటిషన్లను జత చేసింది.