Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీలో ఎఐపిఎస్‌ఓ నిరనస
- దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపు
- ఇజ్రాయెల్ ఆక్రమణను తక్షణమే ఆపాలి
న్యూఢిల్లీ : ఇజ్రాయెల్ సైనిక బలగాలు జర్నలిస్టు షిరీన్ అబు అక్లేV్‌ాను హత్య చేయడాన్ని ఖండిస్తూ ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన (ఏఐపీఎస్ఓ) ఆధ్వర్యంలో శుక్రవారం నాడిక్కడ కన్నాట్ ప్లేస్‌లో నిరసన ప్రదర్శన జరిగింది. ప్లకార్డులు చేబూని నినాదాల హోరెత్తించారు. ఇజ్రాయెల్ దళాలచే అక్లేV్‌ాను చంపడాన్ని నిరసిస్తూ ఆందోళనలకు ఏఐపీిఎస్ఓ అన్ని విభాగాలకు పిలుపునిచ్చింది. నేరానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. ఎఐపిఎస్‌ఓ పాలస్తీనాపై ఇజ్రాయెల్ ఆక్రమణను తక్షణమే ముగించాలని, 1967 సరిహద్దులతో, తూర్పు జెరూసలేం రాజధానిగా ఉన్న పాలస్తీనా రాష్ట్రాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది.
ఈ సందర్భంగా నినననుద్దేశించి ఏఐపీఎస్ఓ ప్రధాన కార్యదర్శి ఆర్. అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఆమె హత్యపై నిష్పాక్షిక విచారణ జరిపి, ఈ దారుణ హత్యకు కారకులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఐక్య రాజ్య సమితి సెక్రటరీ జనరల్ కూడా ఈ క్రూరమైన హత్యను ఖండించారని, స్వతంత్ర విచారణకు డిమాండ్ చేశారని గుర్తు చేశారు. యుఎస్ పౌరురాలైన షిరీన్ అబు అక్లే పాలస్తీనా కవరేజీకి చిహ్నంగా నిలిచిందని, ఇజ్రాయెల్ ఆక్రమణ దళాల క్రూరమైన చేష్టలను, పాలస్తీనియన్లపై వారు చేస్తున్న అకృత్యాలను నిజాయితీతో ప్రపంచానికి నివేదించిందని తెలిపారు. దీంతో ఆమె ఇజ్రాయెల్ దాడికి గురి అయిందని, ఇజ్రాయెల్ రక్షణ దళాలు తన బాధ్యతను స్వీకరించడానికి బదులు, హత్యకు పాలస్తీనియన్లపై నిందలు మోపడం హేయమైనదని విమర్శించారు. పాలక శక్తులు వాస్తవ ప్రాతినిధ్యంతో ఇబ్బంది పడుతున్నప్పుడల్లా చాలా చోట్ల జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో జరిగిన దాడిగా, అబూ అక్లేపై జరిగిన దాడిని చూడాలని అన్నారు. జర్నలిస్టులపై మితవాద, నిరంకుశ శక్తులు చేస్తున్న దాడులకు భారతదేశం కూడా సాక్షిగా ఉందని విమర్శమచారు. అబూ అక్లేV్‌ాను హతమార్చిన శక్తులు, జర్నలిస్టులపై దాడులకు నాయకత్వం వహించిన దేశంలోని హిందుత్వ మతతత్వ శక్తులు లోతైన సైద్ధాంతిక అనుబంధాన్ని, స్నేహాన్ని పంచుకోవడం యాదృచ్ఛికం కాదని పేర్కొన్నారు. అక్లేV్‌ా క్రూరమైన హత్యపై భారతీయ ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంలో భాగంగా ఈ నిరసన జరుగుతుందని అన్నారు. ఏఐపీిఎస్ఓ ప్రధాన కార్యదర్శి పల్లాబ్ సేన్‌గుప్తా, కార్యదర్శి డాక్టర్ ఖాన్ కూడా ప్రసంగించారు. ఈ నిరసనలో విద్యార్థి సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్కర్ష్, విద్యార్థులు, మహిళలు, శాంతికాముకులు పాల్గొన్నారు.