Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాయిదాకు సుప్రీం కోర్టు తిరస్కరణ
న్యూఢిల్లీ : నీట్ పిజీ -22 పరీక్ష వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు శుక్రవారం తిరస్కరించింది. ఈ పరీక్షలను వాయిదా వేస్తే వైద్యులు అందుబాటులోలేని పరిస్థితికి దారి తీస్తుందని చెప్పింది. జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం డాక్టర్లు దాఖలు చేసిన ఈ పిటిషన్ను తోసిపుచ్చింది. నీట్ పిజీ - 22 పరీక్షను వాయిదా వేస్తే గందరగోళం, అనిశ్చితి ఏర్పడుతుందని, ఈ పరీక్షల కోసం సిద్ధమవుతున్న అత్యధిక విద్యార్థులపై ప్రభావం పడుతుందని ధర్మాసనం తెలిపింది. విద్యార్థుల్లో రెండు రకాలవారు ఉన్నారని పేర్కొంది. ఒక వర్గం ఈ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతోందని, రెండో వర్గం పెద్ద సంఖ్యలో ఉందని చెప్పింది. ఈ పరీక్షలను వాయిదా వేస్తే ఎక్కువ మంది విద్యార్థులు, అంటే దాదాపు 2.6లక్షల మంది, ప్రభావితమవుతారని పేర్కొంది. పరీక్షలను సకాలంలో నిర్వహించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు సుప్రీంకోర్టు గమనించింది. కోవిడ్-19 మహమ్మారి వల్ల పక్కదారి పట్టిన దేశం తిరిగి గాడిలో పడాలని పేర్కొంది. ఈ కోర్టు విధించిన టైమ్ షెడ్యూలును తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (నీట్-పీజీ) 2022ను వాయిదా వేయాలని కోరుతూ కొందరు డాక్టర్లు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు మే 10న అంగీకరించింది. నీట్ పీిజీ-2021 కోసం కౌన్సెలింగ్ మే21న జరుగుతుందని, నీట్ పిజీ 2022ను వాయిదా వేయాలని పిటిషనర్లు కోరారు.