Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : జమ్మూ కాశ్మీర్ డీలిమిటేషన్‌పై నివేదిక ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం కోరింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి, జమ్మూ కాశ్మీర్ పరిపాలనావిభాగానికి సుప్రీం కోర్టు నోటీస్ ఇచ్చింది. ప్యానెల్ నివేదిక పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు కూడా పిలుపునిచ్చింది. ఇప్పుడు ఐదు లోక్‌సభ స్థానాలు ఒక్కొక్కటి సరిగ్గా 18 అసెంబ్లీ నియోజకవర్గాలతో రూపొందించబడ్డాయి. మొత్తం సంఖ్య 90కి చేరుకుంది. షెడ్యూల్డ్ తెగలకు తొమ్మిది అసెంబ్లీ స్థానాల రిజర్వేషన్లను ప్యానెల్ సిఫార్సు చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ సంజరు కిషన్ కౌల్,జస్టిస్ ఎంఎం సుందరేష్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. ఈ పిటిషన్లో ఆర్టికల్ 370, 35(ఎ) రద్దుపై లేవనెత్తారు.