Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మైనారిటీలపై దాడులు.. వివాదాస్పద చట్టాలు
- ప్రభుత్వ వ్యతిరేక గొంతును నొక్కే యత్నం : రాజకీయ విశ్లేషకులు
మోడీ ప్రభుత్వంలో పరిస్థితులు ఆందోళనకరం
న్యూఢిల్లీ : వివక్ష, విచక్షణారక్షిత చర్యకు వ్యతిరేకంగా వ్యక్తి వ్యక్తిత్వాన్ని రక్షించడానికి ఒక ప్రామాణిక సూత్రం సమానత్వం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 నుంచి 16 వరకు సమానత్వానికి హామీనిస్తున్నాయని న్యాయ నిపుణులు తెలిపారు. అయితే, మోడీ ప్రభుత్వం హయాంలో ఇది ఆందోళనకరంగా మారిందని తెలిపారు. ''సమాన త్వంపై రాజ్యాంగ ఆదేశం ఆర్టికల్ 14లో వేదిక చేయబడింది. ఇది వ్యక్తి హక్కులు, ప్రభుత్వ విధిని ప్రకటిస్తూ ఉన్న వివరణ. ఆర్టికల్ 14 సమానత్వంపై డిక్లేరేటివ్ అయితే, ఆర్టికల్ 15(1) ఒక నిర్దిష్ట ఆదేశం లేదా ప్రవర్తనా నియమాన్ని నిర్దేశిస్తుంది. రాష్ట్రం, లింగం, మతం, జాతి, కులం లేదా ప్రదేశం ఆధారంగా 'మాత్రమే' వర్గీకరించకూడదు, వివక్ష చూపకూడదు'' అని వివరించారు.
తాత్వికంగా, సమానత్వం, అనే భావన న్యాయమైనదని చెప్పారు. ''ఇది సామాజిక సంస్థల మొదటి కర్తవ్యం. ఏది ఏమైనా, న్యాయపాలనపై ఆధారపడిన ఆధునిక న్యాయవ్యవస్థ సమానత్వాన్ని తన లక్ష్యంగా చెప్పుకోవాలి.
వర్గీకరణ పరీక్ష 1950లో ప్రారంభం నుంచి ఆనవాయితీగా ఉన్నది. ఏకపక్షానికి వ్యతిరేకంగా పరీక్షను సుప్రీంకోర్టు 1973 నాటి ఈ.పీ రోయప్ప కేసులో ప్రవేశపెట్టింది. ఇది రాష్ట్ర ఏకపక్ష నిర్ణయాలు లేదా చర్యలు తప్పనిసరిగా అన్యాయమైన వివక్షకు దారి తీస్తుందని భావించింది. ఇప్పుడు, మూడు దశాబ్దాల తర్వాత, తమిళనాడు కేసులో 'ప్రభావం', దామాషా పరీక్షలు ప్రతిపాదించబడ్డాయి'' అని రాజకీయ విశ్లేషకులు వివరించారు.
కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలోని పరిస్థితులు సంక్లిష్టంగా తయార య్యాయని రాజకీయ నిపుణులు, విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా, వ్యక్తి స్వేచ్ఛ, సమానత్వం, వాక్స్వాతంత్య్రం ప్రమాదంలో పడ్డాయని గుర్తు చేశారు. దేశంలో మైనారిటీలపై జరుగుతున్న దాడులు, మిగతా రాష్ట్రాలతో గుజరాత్‌కు తరలిపోతున్న నిధుల ప్రవాహం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేసేలా, రిజర్వేషన్లను తొలగించేలా మోడీ ప్రభుత్వం చేసిన పలు చర్యలే ఇందుకు ఉదాహరణలు అని తెలిపారు. ఇటు ప్రజా, రైతు వ్యతిరేక వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్నార్సీ), వివాదాస్పద సాగు చట్టాలను కేంద్రం తీసుకొచ్చిందని వివరించారు. అయితే, రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటంతోనే మోడీ సర్కారు సాగు చట్టాల విషయంలో వెనక్కి తగ్గిందని గుర్తు చేశారు.
పౌరులు, సామాజిక వేత్తలు, ప్రజాసంఘాల నాయకులు, దళిత సంఘాల నాయకులు, జర్నలిస్టులు.. ఇలా ప్రతి రంగానికి చెందిన ప్రముఖుల ప్రభుత్వ వ్యతిరేక గొంతును అణచివేసేలా మోడీ ప్రభుత్వం ఉపా, దేశద్రోహం వంటి చట్టాలను ఆయుధాలుగా వినియోగిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు తెలిపారు.