Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓటర్ల జాబితాతో ఆధార్ అనుసంధానంపై సీఈసీ సుశీల్ చంద్ర
న్యూఢిల్లీ : ఓటర్ల జాబితాతో ఆధార్‌ను అనుసంధానించే నిబంధనలను ప్రభుత్వం త్వరలో జారీ చేయవచవ్చని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర అన్నారు. ఆధార్ వివరాలను పంచుకోవటం స్వచ్ఛందమేనని చెప్పారు. అయితే, అలా వివరాలను పంచుకోనివారు తగిన కారణాలు చూపాల్సి ఉంటుందని తెలిపారు. శనివారం సాయంత్రం పదవీ విరమణ చేసిన చంద్ర మాట్లాడుతూ.. ఈ ఏడాది మార్చిలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన ఐదు రాష్ట్రాలలో ఓటర్లు, ఎన్నికల విధుల్లో పాల్గొన్న వారు సురక్షితంగా ఉండేలా టీకాలు వేసే కార్యక్రమాన్ని ముమ్మరం చేయడంలో పోల్ ప్యానెల్ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. 18 ఏండ్లు నిండిన వారిని ఓటరుగా చేర్చుకోవడానికి ఏడాదికి ఒక తేదీకి బదులుగా నాలుగు తేదీలు కేటాయించటం, ఓటర్ల జాబితాతో ఆధార్‌ను అనుసంధానం చేయడం వంటివి సీఈసీగా తన హయాంలో జరిగిన రెండు ప్రధాన ఎన్నికల సంస్కరణలు అని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సుశీల్ చంద్ర తెలిపారు.